logo

బస్సు నడుపుతూ గుట్కా వేసుకుంటుండగా..

బస్సు నడుపుతూ గుట్కా వేసుకుంటుండగా..
Highlights

భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తుండగా మల్హర్‌ మండలం...

భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తుండగా మల్హర్‌ మండలం అడవిసోమనపల్లి దగ్గర బస్సు అదుపుతప్పి లోయలోపడింది. 8 మీటర్ల లోతున్న లోయలోకి బస్సు బోర్లాపడటంతో 63మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో కాటారం, మంథని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. కాగా బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్‌ గుట్కా వేసుకుంటూ స్టీరింగ్‌ వదిలేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top