Top
logo

హైదరాబాద్‌లో ఆకట్టుకున్న గులాబి ప్రదర్శన

హైదరాబాద్‌లో ఆకట్టుకున్న గులాబి ప్రదర్శన
X
Highlights

గులాబి పుష్ప ప్రదర్శన అదరహో అనిపించింది. పూలసోయగాలు, ఉద్యాన సొబగులతో కట్టి పడేసింది. పూర్తిగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతోంది. రంగు రంగుల పుష్పాలు మధురానుభూతిని కల్గిస్తోంది. వేల రకాల పూలు ఒక్కచోట గూబాళిస్తూ సువసనాలు వెదజల్లుతున్నాయి.

గులాబి పుష్ప ప్రదర్శన అదరహో అనిపించింది. పూలసోయగాలు, ఉద్యాన సొబగులతో కట్టి పడేసింది. పూర్తిగా ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతోంది. రంగు రంగుల పుష్పాలు మధురానుభూతిని కల్గిస్తోంది. వేల రకాల పూలు ఒక్కచోట గూబాళిస్తూ సువసనాలు వెదజల్లుతున్నాయి. నగరవాసులను కనువిందు చేస్తున్న గులాబీ అందాలపై మీరు ఓ లుక్కేయండి. అందమైన పూలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతోంది. రంగురంగుల్లో విరిసిన పూల సోయగాలను ఒకే చోట చూస్తే నయనానందమే. హరివిల్లు రంగులు అద్దుకుని, ముద్దగా పూచే గులాబీల అందానికి అందరూ గులాం కావాల్సిందే.

అలాంటి ఆనందానికి కేరాఫ్‌గా మారింది భాగ్యనగరం. వేడుకలకే వెలుగుగా మారుతున్న గులాబి అందాలను చూస్తే చాలు మనసు పులకరించిపోతుంది. మనసులోని భావాన్ని ఎక్స్ ప్రెస్ చేయాలంటే ఓ రోజా ఇస్తే సరిపోతుందంటారు. అందమైన గులాబీలు ప్రతీ ఒక్కరి హృదయాన్ని దోచేస్తాయి. పెళ్లిరోజు, పుట్టినరోజు, వివిధ వేడుకల్లో గులాబీలను అలంకరిస్తే ఈవెంట్‌కే కొత్త అందం వస్తోంది. ఇక ప్రేమికుల రోజు లవర్స్‌ ఇచ్చుకునే బహుమతిలో మధురమైన అందమైన గిఫ్గ్‌గా రోజ్‌ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అరుదైన రంగురంగు రోజాపూలు ఒకే చోట కొలువుదీరితే చూడటానికి రెండుకళ్లు చాలవు. అలాంటి అరుదైన అవకాశాన్ని కల్పిచింది హైదరాబాద్‌ రోజ్‌ సొసైటీ. గూలాబీల గొప్పదనాన్ని చాటి చెప్పాలనే ఉద్ద్యశ్యంతో.. రోజ్‌ సొసైటీ ఆధ్వర్యంలో 37వ ఆలిండియా వార్షిక గులాబీల ప్రదర్శన ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఏర్పాటు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోజ్ షోను ఏర్పాటు చేస్తునట్టు నిర్వహకులు చెబుతున్నారు.

మూడ్రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో ఒకటి కాదు రెండు కాదు వందల రకాల గులాబీలను ఒకే చోట చూసే అవకాశాన్ని కల్పించడంతో వాటిని చూసేందుకు ఎగబడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన రోజ్ వెరైటీస్, అందరిని ఆకట్టుకుంటున్నాయి. లోకల్, హైబ్రీడ్ రోజాలు, ఎరుపు, తెలుపు,పసుపు రంగుల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. రోజ్‌ షో నందన వనాన్ని తలపిస్తోంది. అరుదైన గులాబి అందాలు మైస్మరైజ్‌ చేస్తున్నాయి. గులాబీలను చూసి నగరవాసులు మైమరిచిపోతున్నారు. సప్తవర్ణ కాంతులతో కూడిన పువ్వులు కేకపుటిస్తున్నాయి. ఐదు వందలకు పైగా పూల మొక్కలు ఒకే చోట కొలువుదీరాయి.

భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో చూసి ప్రజలు మైమరిచిపోతున్నారు. వందలాది పువ్వులు ఒకే దగ్గర ఆహ్లాదాన్ని పంచుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రంగురంగుల పూలు విభిన్న రకాల మొక్కలతో అందమైన ఆకృతులు కొలువుదీరాయి. ఎన్నెన్నో వర్ణాల పూలు ముసి ముసి నవ్వులతో సందర్శకులను స్వాగతిస్తున్నాయి. ఆ పూల సోయగాలను చూస్తుంటే.. ఇంద్రధనుస్సు నేలపై విరిసినట్లు, పుడమి రంగుల తివాచీగా మారినట్లు తోస్తుంది. పుష్ప ప్రేమికులను అట్రాక్ట్ చేస్తోంది. వివిధ రకాల పూల మొక్కలు చూసి నగర వాసులు మెస్మరైజ్ అవుతున్నారు.

మొఘలుల పాలనా కాలంలో గులాబీలు ఇరాన్‌ నుంచి భారత్‌కు వచ్చినట్లు హైదరాబాద్‌ రోజ్‌ సొసైటీ సభ్యుడు చెప్పారు. సంప్రదాయ గులాబీల పెంపకంపై అవగాహన కల్పించేందుకు తరచూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రకాల గులాబీ మొక్కలు గురించి, వాటిని ఎలా పెంచుతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు చేసుకోవాలనే విషయాలను సందర్శకులు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.

ప్రదర్శనకు భారీ సంఖ్యలో వచ్చిన ఎంట్రీల నుంచి ఎంపిక చేసిన 300కు పైగా వైరైటీలను ప్రదర్శనలో ఉంచినట్లు రోజ్‌ సోసైటీ నిర్వాకులు తెలిపారు. ఈ ప్రదర్శన సదస్సు కోసం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి గులాబీ ప్రేమికులు, ఎగుమతిదారులు, వ్యాపారవేత్తలు, రైతులు, హైబ్రిడైజర్లు వచ్చారని తెలిపారు.ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల గులాబీలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇంటర్నేషనల్‌ ఫ్లవర్‌ ఎగ్జిబిషన్‌ను చూసేందుకు నగరవాసులు క్యూ కట్టారు. చిట్టి గులాబీల నుంచి పెద్ద, పెద్ద గులాబీలు సప్తవర్ణాలలో కొలువుతీరి సందర్శకులను ఆకట్టుకున్నాయి. పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా విచ్చేసి గులాబీ మొక్కలను ఆసక్తిగా తిలకించారు. ఇప్పటి వరకు ఎరుపు, రోజ్‌, పసుపు, తెలుపు రంగులవే చూశామని అయితే ఈ షోలో వివిధ కలర్స్‌ చూస్తుంటే సంతోషంగా ఉందంటున్నారు.

Next Story