ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై రోజా రియాక్షన్ ఇదే..

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై రోజా రియాక్షన్ ఇదే..
x
Highlights

అసలే ఎండాకాలం పైగా మే నెల భానుడు భగభగ మంటున్నాడు. దీనికి ఎన్నికల వేడి కూడా తోడయింది. ఇది అలాంటి ఇలాంటి వేడి కాదు అత్యంత భారీస్థాయిలో మనసుల్లో పుట్టిన...

అసలే ఎండాకాలం పైగా మే నెల భానుడు భగభగ మంటున్నాడు. దీనికి ఎన్నికల వేడి కూడా తోడయింది. ఇది అలాంటి ఇలాంటి వేడి కాదు అత్యంత భారీస్థాయిలో మనసుల్లో పుట్టిన వేడి. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా మరో మూడ్రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈలోపే ఆదివారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఈ ఉష్ణాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లాయి. ఎన్నికల ముందు నిర్వహించిన ప్రీ పోల్‌ సర్వే ఫలితాలే ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ ప్రతిబింబించాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్ సర్వేలపై టీడీపీ, వైసీపీ డిఫరెంట్‌‌గా స్పందించాయి. మెజారిటీ ఎగ్జిట్‌ పోల్ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉంటే, మరికొన్ని మాత్రం టీడీపీకి పాజిటివ్‌గా ఇచ్చాయి. దీంతో బయటకు చెప్పలేకపోతున్నా ఇరు పార్టీల్లో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ అసలు ఎగ్జిట్ పోల్స్‌ను అంత గుడ్డిగా నమ్మలేమన్నారు. ఫలితాలపై ఇలాంటి సర్వేలను నమ్మనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజలతో మమేకమై వారు ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకున్నామని రోజా అన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారన్నారు. ఏపీ ప్రజలను కలిసి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారని చెప్పారు. ఏపీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారని గంటాపథంగా చెబుతున్నానని అన్నారు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే వస్తాయని రోజా ఆశాభావం వ్యక్తంచేశారు. రోజా నగరి నియోజకవర్గం నుంచి ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. మరి రోజా నమ్మకం నిజమవుతుందో తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories