Top
logo

టీఆర్‌ఎస్‌లో హరీష్‌కు కాలం చెల్లినట్టే: రేవంత్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌లో హరీష్‌కు కాలం చెల్లినట్టే: రేవంత్‌రెడ్డి
X
Highlights

చాలా రోజుల తరువాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనుముల రేవంత్ రెడ్డి....

చాలా రోజుల తరువాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనుముల రేవంత్ రెడ్డి. అధికార పార్టీ టీఆర్ఎస్‌లో తన్నీరు హరీశ్‌రావుకు కాలం చెల్లినట్లేని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఓ కేసు విషయంలో రేవంత్ రెడ్డి హరీశ్‌రావు నియోజకవర్గమైన సిద్దిపేట కోర్ఠుకు హాజరైయ్యారు రేవంత్ రెడ్డి. అనంతం మీడియాతో మాట్లాడతూ నమ్మినవాళ్లను నట్టేటముంచటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలావాటేన్నారు రేవంత్. హరీశ్‌రావుకు సిద్దిపేట ఈసారే ఆఖరని మరోసారి టికెట్ రాదన్నారు. రాష్ట్రంలో 16 మంది ఎంపీలుంటే ఏదో చేస్తామంటున్నారని, ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొచ్చారా? విభజన హామీలు సాధించారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Next Story