రాహుల్ గాంధీ సభకు రేవంత్ రెడ్డి డుమ్మా... కారణం ఇదేనా ?

రాహుల్ గాంధీ సభకు రేవంత్ రెడ్డి డుమ్మా... కారణం ఇదేనా ?
x
Highlights

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శంఖం పూరించింది. ఇందుకోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ ...

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శంఖం పూరించింది. ఇందుకోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ సమీపంలోని క్లాసిక్ కన్వెన్షన్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలసిందే కాగా ఈ సభకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రాలేదు. ఇక దీంతో ఇప్పుడు అందరిలోనూ ఇదే హట్ టాపిక్ గా మారింది. అయితే రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉండి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సభకు రాలేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు. వాస్తవానికి రాహుల్ సభలో ఎప్పుడైనా ముందు వరసలో ఉండేవారు. అయితే రేవంత్ రెడ్డి రాకపోయినప్పటికీ స్వాగత ఉపన్యాసంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతలను ఆహ్వానిస్తున్న క్రమంలో కొడంగల్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి గైర్హజరు కాకపోవడంతో ఆయన రేవంత్ అధినాయకత్వంపై సీరియస్‌గా ఉన్నారా? రేవంత్ రెడ్డికి పార్టీలో సరైనా గౌరవం దక్కడం లేదా లేక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ మాట చెల్లడం లేదనే అసంతృప్తిని వెంటాడుతుందా? ఇలా చూస్తే అనేక రకాల ప్రశ్నలు తలెత్తున్నాయి. కాగా ఇటివలే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీ తీర్థంపుచ్చుకున్న ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య రాహుల్ సభకు గైర్హాజరయ్యారు. ఇక మిగతవారంతా కూడా రాహుల్ సభకు వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories