మల్కాజ్ గిరిలో రేవంత్..చేవెళ్లలో కొండా

మల్కాజ్ గిరిలో రేవంత్..చేవెళ్లలో కొండా
x
Highlights

తెలంగాణలో లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

తెలంగాణలో లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్‌ తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థులు ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయినవారే ఉన్నారు.

తెలంగాణలో లోక్ సభకు పోటీ చేసే 8 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. ఢిల్లీలో సోనియాగాంధీ నివాసంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. సోనియా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్నికల కమిటీ సభ్యుడు ఏకే ఆంటోని, వీరప్పమొయిలీ, అహ్మద్‌ పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌.సి.కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ ఇన్‌చార్జ్‌ లు కార్యదర్శులు పాల్గొన్నారు. 8 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి, జాబితాకు ఆమోదం తెలిపారు.

కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి.

ఆదిలాబాద్‌: రమేశ్‌ రాథోడ్‌

మహబూబాబాద్‌: బలరాం నాయక్‌

పెద్దపల్లి: ఎ.చంద్రశేఖర్‌

కరీంనగర్‌: పొన్నం ప్రభాకర్‌

మల్కాజ్‌గిరి: ఎ.రేవంత్‌రెడ్డి

జహీరాబాద్‌: కె.మదన్‌మోహన్‌

చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మెదక్‌ నుంచి గాలి అనిల్‌కుమార్‌ పోటీ చేయనున్నారు.

కాంగ్రెస్‌ తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్లో ఐదుగురు ఇటీవల అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చవిచూసినవారే ఉండటం గమనార్హం. పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), రమేశ్‌రాథోడ్‌ (ఖానాపూర్‌), బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌), చంద్రశేఖర్‌ (వికారాబాద్‌) ఎమ్మెల్యేలుగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా, తొలిజాబితాలో 8 మంద పేర్లు వెలువరించిన కాంగ్రెస్ మిగిలిన 9 మంది అభ్యర్థుల పేర్లను ఇవాళ ప్రకటించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories