నాలుగేళ్లలో ఏపీలో గణనీయమైన అభివృద్ధి: గవర్నర్

నాలుగేళ్లలో ఏపీలో గణనీయమైన అభివృద్ధి: గవర్నర్
x
Highlights

నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు గవర్నర్ నరసింహన్. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు.

నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు గవర్నర్ నరసింహన్. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, వివిధ బృందాల కవాతు ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి.

రిపబ్లిక్ డే వేడుకలను ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఘనంగా నిర్వహించింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండా ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. టెక్నాలజీతో ఉత్పాదకతను పెంచుతోందని తెలిపారు. విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌ వన్‌గా ఉందని గవర్నర్‌ పేర్కొన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. విద్యుత్‌ కొరత ఉన్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం చేశామని గవర్నర్‌ నరసింహన్ చెప్పారు.

మరోవైపు ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్య సేవలు అందజేస్తున్నట్టు గవర్నర్ నరసింహన్ తెలిపారు. అలాగే ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి హైస్పీడ్‌ ఇంటర్నెట్ సదుపాయం కల్పించామని, గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సురక్షిత తాగునీటి కోసం వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని తీసుకువచ్చామన్న గవర్నర్ రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు.

వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, వివిధ బృందాల కవాతు ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. సమాచారశాఖ శకటం ప్రథమ స్థానంలో నిలువగా, అటవీశాఖ శకటం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే పర్యాటక శాఖ శకటానికి తృతీయ స్థానం దక్కింది. ప్రథమ ఉత్తమ కవాతుగా ఇండియన్ ఆర్మీ, ఎన్‌సీసీ బాలురు నిలవగా, రెండవ ఉత్తమ కవాతుగా ఏపీ స్పెషల్ పోలీస్, ఎన్‌సీసీ బాలికలు నిలిచారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబుతోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories