Top
logo

కేసీఆర్‌ నోటికి జీఎస్టీ విధించాలి: రేణుక

కేసీఆర్‌ నోటికి జీఎస్టీ విధించాలి: రేణుక
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి మండిపడ్డారు. అతని నోటికి...

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రేణుకా చౌదరి మండిపడ్డారు. అతని నోటికి అడ్డూఅదుపు లేదన్నారు.. ఆయన నోటికి జీఎస్టీ విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న రేణుకా చౌదరి.. కేసీఆర్ వెటకారంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తాను కేంద్ర మంత్రులను కలిసింది గ్రానైట్‌ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించాలని కోరేందుకేనని రేణుకా చౌదరి తెలిపారు. జీఎస్టీ ఎందుకు తగ్గించాలో వివరించి చెప్పడంతో గ్రానైట్‌ పరిశ్రమపై విధిస్తున్న జీఎస్టీని కేంద్రం తగ్గించిందని ఆమె పేర్కొన్నారు.

Next Story