బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ ..

బిగ్ బాస్ 3 పై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్ ..
x
Highlights

బుల్లితెరపై బిగ్ బస్ తనదైన ముద్రను వేసింది . చిన్ని చిన్ని టాస్కులతో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ షో .. అయితే ఇప్పటికే...

బుల్లితెరపై బిగ్ బస్ తనదైన ముద్రను వేసింది . చిన్ని చిన్ని టాస్కులతో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ షో .. అయితే ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది . అయితే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొనబోయేది వీరే అంటూ ఇటీవల పలువురు సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. ఇందులో రేణు దేశాయ్ పేరు కూడా వినిపించడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో తనకు చాలా మంది నుంచి సందేశాలు, ఫోన్లు వస్తున్నాయని, వారందరికీ నేను ఒకటే చెబుతున్నాను. బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం లేదు. అదంతా తప్పుడు ప్రచారమే అని స్పష్టం చేశారు.అయితే తనకు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం కంటే ఆ షోను హోస్ట్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. అయితే అలాంటి అవకాశం నాకు వస్తుందో లేదో తెలియదని అన్నారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories