సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన రద్దు..ఎందుకంటే..

సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన రద్దు..ఎందుకంటే..
x
Highlights

దావోస్‌‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళకూడదని ఏపీ చంద్రబాబు నిర్ణంచుకున్నారు. పార్టీలో చేరకలు, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.

దావోస్‌‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళకూడదని ఏపీ చంద్రబాబు నిర్ణంచుకున్నారు. పార్టీలో చేరకలు, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. చంద్రబాబు తరపున ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ మంత్రి లోకేశ్‌ వెళ్తున్నారు. లోకేశ్‌ నేతృత్వంలో 17 మంది ఏపీ బృందం ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్ళబోతోంది. ఈ నెల 22 నుంచి 25 వరకు దావోస్‌లో ఏపీ ప్రతినిధులు పర్యటిస్తారు. 12 రోజుల పాటు ఈ దావోస్ పర్యటనలో పాల్గోనాలని సీఎం చంద్రబాబు గతంలోనే నిర్ణయించారు. కాగా దీనికి కేంద్రసర్కార్ నాలుగు రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ అనుమతి మంజూరు చేసింది. ఇక దీంతో రానున్న గణతంత్ర వేడుకలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈనెల 21న మధ్యాహ్నం ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories