'సూరత్‌' రియల్‌ హీరో

సూరత్‌ రియల్‌ హీరో
x
Highlights

సూరత్ ప్రమాదంలో ఓ యువకుడు సాహసం చేశాడు. తాను ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా మరో 12 మంది ప్రాణాలు కాపాడాడు. మంటల్లో చిక్కుకోకుండా వారిని కాపాడిన వీడియో...

సూరత్ ప్రమాదంలో ఓ యువకుడు సాహసం చేశాడు. తాను ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా మరో 12 మంది ప్రాణాలు కాపాడాడు. మంటల్లో చిక్కుకోకుండా వారిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేతన్ సాహసంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సూరత్ ప్రమాదంలో ఓ యువకుడు దైర్యసాహసాలు ప్రదర్శించాడు. కోచింగ్ సెంటర్‌లో మంటలు ఎగిసిపడుతున్న సందర్భంలో ప్రాణాలు దక్కించుకునేందుకు విద్యార్థులు నాలుగో అంతస్తు నుంచి దూకుతున్నారు. అందరిలానే అక్కడి నుంచి తప్పించుకున్న కేతన్ జొరవాడియా అసమాన దైర్య సాహసాలు ప్రదర్శించాడు.

మంటల నుంచి తప్పించుకునే క్రమంలో విద్యార్థులు అంత ఎత్తు నుంచి నేలపై పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించాడు. మొదట మంటల్లో చిక్కుకున్న 4వ అంతస్తు నుంచి సన్నటి తాడు సాయంతో కేతన్ మూడో అంతస్తుపైకి దిగాడు. అక్కడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ కేతన్ అక్కడే ఉండి మంటల్లో చిక్కుకున్న విద్యార్థులకు సాయం చేసేందుకు యత్నించాడు. 12మంది విద్యార్థులను ప్రమాదం నుంచి రక్షించాడు. భయంతో ఉన్న ఇద్దరి యువతులు కిందకు పడిపోకుండా సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది వీరిని కాపాడారు. యువతులకు సాయం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు కేతన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories