సప్లమెంటరీ ఫలితాలకన్నా ముందే..

సప్లమెంటరీ ఫలితాలకన్నా ముందే..
x
Highlights

ఇంటర్ పరీక్ష ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కలెక్టర్లతో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ...

ఇంటర్ పరీక్ష ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కలెక్టర్లతో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రి వేరిఫికేషన్‌, రీ కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చించారు. జిల్లాల వారిగా విద్యార్ధుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారిగా ఫెయిల్ అయిన విద్యార్ధులతో పాటు రీ కౌంటింగ్‌‌ కోరుతున్న వారి వివరాలు వేర్వేరుగా సిద్ధం చేయాలని సూచించారు. రోజులు గడుస్తున్నా ఇంటర్ బోర్డ్ దగ్గర ఉద్రిక్త పరిస్ధితులు తగ్గడం లేదు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్ తక్షణమే నిర్వహించాలని కోరుతూ ఇంటర్ బోర్డ్ దగ్గర ఆందోళనకు దిగ్గారు.

అయితే ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కాగా సప్లిమెంటరీ ఫలితాలకు ముందే రీ వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ధరణి ప్రాజెక్టుకు ఉపయోగిస్తున్న స్కానర్లను ఇందుకోసం వినియోగిస్తున్నమని కాగా 12 కేంద్రాల్లో రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించామని అన్నారు. రోజూ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌పై బులిటెన్‌ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఒక్కో కేంద్రంలో 70వేల నుండి లక్షన్నర జవాబు పత్రాల రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ చేస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories