త్వరలో రూ.20 కొత్త నోటు.. ప్రత్యేక ఫీచర్లు ఇవే..

త్వరలో రూ.20 కొత్త నోటు.. ప్రత్యేక ఫీచర్లు ఇవే..
x
Highlights

త్వరలో కొత్త రూ.20 రూపాయల నోట్లు దేశంలో చలామణిలోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్నరూ.20 రూపాయల నోట్లను చలామణిచేస్తూనే దానికి అదనంగా కొత్త...

త్వరలో కొత్త రూ.20 రూపాయల నోట్లు దేశంలో చలామణిలోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం చలామణిలో ఉన్నరూ.20 రూపాయల నోట్లను చలామణిచేస్తూనే దానికి అదనంగా కొత్త కరెన్సీని అందుబాటులోకి తీసుకొస్తామని రిజర్వుబ్యాంకు వెల్లడించింది. దినికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈ నోటు నమూనాను ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతో కూడిన ఈ మహాత్మా గాంధీ (కొత్త) సరీస్‌ నోటు ఆకుపచ్చని పసుపు వర్ణంలో ఉండనుదని తెలిపింది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. దాంట్లోనే అశోకుడి స్థూపం కూడా ఉంటుంది. ఇక నోటు వెనక భాగంలో ఎల్లోరా గుహల చిత్రంతో పాటూ స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉంటాయి. ఈ నోటు సైజు 63 mm x 129 mm గా ఉండనుంది. ఇప్పటికే రూ.10, రూ.100 విలువచేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories