Top
logo

150 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తాం: రాయపాటి

150 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తాం: రాయపాటి
X
Highlights

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు...

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు . ఓ వర్గం మీడియా అసత్యలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను టీడీపీ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సాంబశివరావు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తనకుందని చెప్పారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందని రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తాను పోటీ చేసే లోక్‌సభ నియోజకవర్గంలో తప్పకుండా 7 అసెంబ్లీ స్థానాలూ గెలుస్తామని రాయపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story