logo

తెలంగాణపై రామ్‌మాధవ్‌ను ప్రయోగించిన బీజేపీ...ఎవరూ ఊహించనివిధంగా...

తెలంగాణపై రామ్‌మాధవ్‌ను ప్రయోగించిన బీజేపీ...ఎవరూ ఊహించనివిధంగా...
Highlights

అమిత్‌షా టీమ్‌లో బ్రహ్మాస్త్రమైన రామ్‌మాధవ్‌ను తెలంగాణపై ప్రయోగించారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల్లోని సీనియర్...

అమిత్‌షా టీమ్‌లో బ్రహ్మాస్త్రమైన రామ్‌మాధవ్‌ను తెలంగాణపై ప్రయోగించారు. కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల్లోని సీనియర్ లీడర్లు, ప్రజల్లో పట్టున్న నేతలను కమలం గూటికి చేర్చే బాధ్యతలను అప్పగించారు. అమిత్‌షా ఆదేశాలతో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఇరవై రోజుల ముందు రంగంలోకి దిగిన రామ్‌మాధవ్‌ తెలంగాణలో తన ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలతో చర్చలు జరిపిన రామ్‌మాధవ్‌ కాంగ్రెస్ సీనియర్ లీడర్‌ డీకే అరుణ, టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌‌రెడ్డికి కమలం గూటికి చేర్చారు. దాంతో రామ్‌మాధవ్‌ పేరు చెబితేనే ప్రధాన పార్టీలు ఉలిక్కి పడుతున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నించి విసిగిపోయిన అమిత్‌షా బ్రహ్మాస్త్రంగా రామ్‌‌-బాణాన్ని ప్రయోగించారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ బాధ్యతలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌కి అప్పగించారు. దాంతో సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఇరవై రోజుల ముందు రంగంలోకి దిగిన రామ్‌మాధవ్‌ తెలంగాణలో తన ఆపరేషన్ మొదలుపెట్టారు. రావడం రావడంతోనే ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్‌ సీనియర్ లీడర్ డీకే అరుణను కమలం గూటికి చేర్చారు.

ముఖ్యంగా కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల్లో అసంతృప్తితో ఉన్న ముఖ‌్యనేతలపై దృష్టిపెట్టిన రామ్‌మాధవ్‌ ఆయా నేతల ఇంటికెళ్లి మరీ చర్చలు జరుపుతూ పార్టీలోకి తీసుకొచ్చారు. ఇదే తరహాలో డీకే అరుణను కమలం గూటికి చేర్చిన రామ్‌మాధవ్‌ ఇప్పుడు టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చారు.

ఆపరేషన్ ఆకర్షే కాదు తెలంగాణ సమస్యలపైనా రామ్‌‌మాధవ్‌ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోని సమస్యలను గుర్తించి ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో రైతుల సమస్యలపై దృష్టిపెట్టిన రామ్‌మాధవ్ పసుపు బోర్డు డిమాండ్‌పై కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో పెట్టనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు మద్దతు ధర తరహాలో పసుపు కొనుగోలుకు ప్రొక్యూర్మెంట్ కల్పిస్తామని సంచలన హామీ ప్రకటించి నిజామాబాద్ రైతన్నలను ఆకట్టునే ప్రయత్నం చేశారు.

డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలు కమలం గూటికి చేరడంతో తెలంగాణలో రామ్‌మాధవ్‌ పేరు మార్మోగిపోతోంది. అంతేకాదు ఇప్పటికే కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ల్లోని అనేకమంది ముఖ్యనేతలు, ప్రజల్లో పట్టున్న లీడర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరికొందరు ప్రముఖ లీడర్లు బీజేపీ గూటికి చేరడం ఖాయమంటున్నారు. దాంతో రామ్‌మాధవ్‌ తెలంగాణ వస్తున్నారంటే చాలు టీకాంగ్రెస్‌, టీటీడీపీతోపాటు టీఆర్‌ఎస్‌ కూడా ఉలిక్కిపడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎప్పుడు కమలం గూటికి చేరతారో తెలియక అనుమానమున్న నేతలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంట. అవసరమైతే ఫోన్ చేసిమరీ ఆరా తీస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే వారంలో ఒకరోజు కచ్చితంగా హైదరాబాద్ వస్తున్న రామ్‌మాధవ్‌ ఆపరేషన్ ఆకర్ష్‌ కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.



లైవ్ టీవి


Share it
Top