పాల్‌ పంచ్‌లపై వర్మ సెటైర్‌!

పాల్‌ పంచ్‌లపై వర్మ సెటైర్‌!
x
Highlights

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీ...

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీ అధినేతలు ప్రచారంలో ఫుల్ బీజీ అవుంటే కేఏ పాల్ మాత్రం ప్రస్తుతం వీడియోలతోనే దర్శనమిస్తున్నారు. తాజాగా కేఏ పాల్ తన వాహనంలో ఎక్కడికో ప్రయాణిస్తున్న కారు ముందు భాగంలో కూర్చోని బాక్సింగ్ ఆడుతున్నట్లు, పక్క వారిని పడగొడుతున్నట్లు ఉన్న ఓ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో దూమ్మురేపుతోంది. ఇక ఆ వీడియా కాస్తా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేతికి చిక్కింది. దీంతో వర్మ తనదైన శైలీలో వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఏమన్నాడో తెలుసా?

ప్రపంచ దిగ్గజ బాక్సర్ చాంపియన్ మైక్ టైసన్‌ను మట్టికరిపించిన ఈవాండర్ హోలీఫీల్డ్‌కు కేఏ పాలే బాక్సింగ్‌లో ట్రెయినింగ్ ఇచ్చాడని నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా అంటూ వర్మ సెటైర్ వేశాడు. ఇక ఓవైపు వర్మ ట్వీట్ మరోవైపు కేఏపాల్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories