చంద్రబాబుని తరిమేయండి...: రామ్ గోపాల్ వర్మ

చంద్రబాబుని తరిమేయండి...: రామ్ గోపాల్ వర్మ
x
Highlights

తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కి అప్పగించాలని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూచించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టారు....

తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కి అప్పగించాలని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూచించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ఒక పోల్ పెట్టారు. 41,911 మంది ఓటు వేయగా 79శాతం తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కి అప్పగించడమే సమంజసమని ఓటు వేయగా, 21శాతం మంది వ్యతిరేకించారు. ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడుతోకానీ, ఆ వెన్నుపోటుని సమర్థించిన బాబాయ్ బాలకృష్ణతోకానీ ఉండటం న్యాయసమ్మతం కాదని, రామ్ గోపాల్ వర్మ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్ లాంటి మహానుభావులు పెట్టిన ఆ పార్టీని కాపాడగలిగేది నందమూరి వంశానికి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆరేనని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

తక్షణమే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జరిగిన ఘోర పరాభవాన్ని, ఓటమిని ప్రజలు మర్చిపోతారని మళ్లీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం కుదురుతుందని, ఆ పార్టీ నిజమైన నందమూరి వారసుల చేతుల్లో పడిందని నమ్ముతారని అన్నారు. అయితే వెన్నుపోటుదారులతో కుట్రలో భాగస్వాములైన బాలకృష్ణను మాత్రం జనం నమ్మరని, జూనియర్ ఎన్టీఆరే తెలుగుదేశం పార్టీకి సరైన నాయకత్వం వహించే వ్యక్తి అని అన్నారు. వరుస ట్వీట్లతో ఇలా సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ, చివరగా ఎండలు ముదిరిపోయి ఉన్నాయి, కమ్మవారు బైటకు రావడంలేదు.. ఎండల దెబ్బకు భయపడి కాదు, రెడ్ల దెబ్బకు భయపడే కమ్మవాళ్లు బైటకు రావడంలేదని ఛలోక్తి విసిరారు. తనకు కులపిచ్చి లేదని, తాను ఏ కులానికీ చెందినవాడిని కాదని, అయితే గత ఐదేళ్లుగా విజయవాడలో జరుగుతున్న పరిణామాలు చూసి కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమా స్క్రిప్ట్ తయారు చేశానని అన్నారు.









Show Full Article
Print Article
Next Story
More Stories