రామ్‌ గోపాల్ వర్మ తొలిసారిగా!

రామ్‌ గోపాల్ వర్మ తొలిసారిగా!
x
Highlights

సంచలన చిత్రాలకు మారుపేరుగా నిలుస్తాడు దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ. తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తో వెండితెరపై దూమ్మురేపిన విషయం తెలిసిందే. చాలా రోజుల...

సంచలన చిత్రాలకు మారుపేరుగా నిలుస్తాడు దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ. తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తో వెండితెరపై దూమ్మురేపిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత వర్మ మంచి హీట్ అందుకున్నాడు. కగా వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు వర్మ దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ త్వరలో నటుడిగా మారనున్నాడు. నేడు ఆదివారం రామ్‌ గోపాల్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గన్‌ షాట్‌ ఫిలింస్‌ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌తో తొలిసారిగా రామ్ గోపాల్ వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు. దినికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories