జనసేనానిపై పాట రూపొందించిన రామ్‌చరణ్

జనసేనానిపై పాట రూపొందించిన రామ్‌చరణ్
x
Highlights

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ హీరో రామ్‌చరణ్ తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌పై ఒక పాట రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దేశం కోసం పాటుపడ్డ జాతీయ...

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ హీరో రామ్‌చరణ్ తన బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌పై ఒక పాట రూపొందించి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. దేశం కోసం పాటుపడ్డ జాతీయ నాయకులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కడొచ్చాడంటూ మొదలైన సాంగ్ జనసేనై కదిలాడంటూ సాగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories