బెలంకొండ బాబులో అంతలోనే ఇంతా మార్పా ..!

బెలంకొండ బాబులో అంతలోనే ఇంతా మార్పా ..!
x
Highlights

దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా తయారయింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిస్థితి .. సరైనా హిట్టు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు .. తీసే...

దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా తయారయింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పరిస్థితి .. సరైనా హిట్టు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు .. తీసే దర్శకులు , పెట్టె నిర్మాతలు ఉన్నారు.. ఇక కావాల్సింది హిట్టు మాత్రమే .. ఈ వారం సీత అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ .. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు .. ఇప్పుడు రాక్షసుడు అంటూ సినిమా టిజర్ తో సందడి మొదలు పెట్టాడు..

ఈ చిత్ర టిజర్ అయన అన్ని సినిమాల కంటే కొంచం భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది . యాక్షన్ ఎపిసోడ్స్ , గొంతు చించుకొని అరిచే డైలాగ్స్ కాకుండా కధకు ప్రాధాన్యం ఉన్నా సినిమాలా కనిపిస్తుంది . సినిమా మొత్తం సైకో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుందట.. తమిళంలో హిట్టైన 'రాచ్చసన్' సినిమాను తెలుగులో 'రాక్షసుడు'తో పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు బెల్లంకొండ. రమేష్ వర్మ దర్శకత్వం వహించగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రాక్షసుడు

Show Full Article
Print Article
Next Story
More Stories