ట్రిపుల్ తలాక్ బిల్లుపై అట్టుడికిన రాజ్యసభ

ట్రిపుల్ తలాక్ బిల్లుపై అట్టుడికిన రాజ్యసభ
x
Highlights

ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభ దద్దరల్లింది. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రయత్నించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుని తాము వ్యతిరేకించడం లేదని, సెలెక్ట్ కమిటీకి పంపించి చర్చించిన తర్వాతే సభలో పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభ దద్దరల్లింది. లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రయత్నించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుని తాము వ్యతిరేకించడం లేదని, సెలెక్ట్ కమిటీకి పంపించి చర్చించిన తర్వాతే సభలో పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ ఛైర్మన్ కోరినప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన విరమించలేదు. దీంతో సభను జనవరి 2కి వాయిదా వేశారు. రాజ్యసభ ప్రారంభం కాగానే వివిధ రాజకీయ పక్షాలు తమ సమస్యలపై ఆందోళనకు దిగాయి. దీంతో, సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభం అయిన తర్వాత ట్రిపుల్ తలాక్ బిల్లుని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో, సభను డిప్యూటీ చైర్మన్ 15 నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఆర్డర్ లో లేకపోవడంతో జనవరి 2కి వాయిదా వేశారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ముందు విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరపాలని కూడా విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాల్సిందేనని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ మేరకు చేసిన తీర్మానంపై ఇప్పటికే 11 పార్టీలు సంతకాలు చేశాయి. సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు తీర్మానం చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లులో ఉన్నమూడేళ్ల జైలు శిక్ష విషయంలో విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భర్త జైలులో ఉంటే భార్యకు పరిహారం ఎవరు చెల్లిస్తారనే విషయంలో క్లారిటీ లేకపోవడాన్ని కూడా విపక్షాలు తప్పుబడుతున్నాయి.

కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో రాజకీయంగా రాద్దాంతం చేయాలని చూస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మన దేశంలో ట్రిపుల్ తలాక్ జాడ్యం పోలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 2018 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ విషయంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. వీలైనంత త్వరగా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. అయితే ఇంత హడావుడిగా దీనిపై బిల్లు తీసుకురావాల్సిన అవసరమేంటని కచ్చితంగా దీనిపై సమీక్ష జరపాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories