Top
logo

మోడీ లేకుంటే చంద్రబాబు జీరో: సోము వీర్రాజు

మోడీ లేకుంటే చంద్రబాబు జీరో: సోము వీర్రాజు
X
Highlights

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే ఒకరి మీద మరోకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తప్పకుండా ఏపీ ప్రజలు తగిన బుద్దిచెబుతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు.

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే ఒకరి మీద మరోకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తప్పకుండా ఏపీ ప్రజలు తగిన బుద్దిచెబుతారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబును ఇంటికి పంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, అసలు ఏపీలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన అభివృద్దిని తెలుగుదేశం ప్రభుత్వం విమర్శించడం నిజంగా సిగ్గుచేటని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర్రాజు మాట్లాడారు. ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ తర్వలోనే కడప నుండి ప్రారంభిస్తారని వెల్లడించారు. నాలుగేండ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రూ. ఆరుకోట్లు దోచుకున్నారని వీర్రాజు ఆరోపించారు. అసలు చంద్రబాబు అవినీతికి హద్దులేవని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ సహాయం లేకుంటే సీఎం చంద్రబాబు జీరో అని వీర్రాజు వ్యాఖ్యానించారు.

Next Story