Top
logo

'నాయకత్వాన్ని మార్చాలని కోరుతున్నా'

నాయకత్వాన్ని మార్చాలని కోరుతున్నా
X
Highlights

సీఎల్పీ సమావేశం హాట్‌ హాట్‌ గా సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమావేశం మధ్యలో నుంచే ...

సీఎల్పీ సమావేశం హాట్‌ హాట్‌ గా సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని మార్చాలని అప్పుడే పార్టీ పరిస్థితి మెరుగవుతుందని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తుంటే జోష్‌ రావడం లేదన్నారు. బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలని ఎన్నికలకు ముందు చెప్పానని ఇప్పుడూ అదే చెబుతున్నట్లు రాజగోపాల్‌రెడ్డి వివరించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుస్తామన్న ఆయన రాహుల్‌ను ప్రధాని చేయడమే తన లక్ష్యమని వివరించారు.

Next Story