logo

ఎమ్మెల్యేగా రాజాసింగ్ ప్రమాణం

raja singhraja singh
Highlights

గోషామహల్‌ ఎమ్మెల్యేగా బీజేపీ సభ్యుడు రాజాసింగ్‌ ఇవాళ స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఎంఐఎం సభ్యుడు...

గోషామహల్‌ ఎమ్మెల్యేగా బీజేపీ సభ్యుడు రాజాసింగ్‌ ఇవాళ స్పీకర్‌ ఛాంబర్‌లో ప్రమాణస్వీకారం చేశారు. ఎంఐఎం సభ్యుడు ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉండటాన్ని వ్యతిరేకించిన రాజాసింగ్‌ ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. దీంతో ఇవాళ స్పీకర్‌ ఛాంబర్‌లో గోషామహల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజాసింగ్ చేత శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేయించారు. రాజాసింగ్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.


లైవ్ టీవి


Share it
Top