Top
logo

ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్‌ దూరం!

Raja Singh
X
Raja Singh
Highlights

మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాను ప్రమాణ స్వీకారం చేయను అన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాను ప్రమాణ స్వీకారం చేయను అన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అసెంబ్లీలో గురువారం జరుగనున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటానని ఎమ్మెల్యే రాజాసింగ్‌ పునరుద్ఘాటించారు. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ముందు తాను ప్రమాణం చేయనని బుధవారం తెలిపారు. అసెంబ్లీలో జాతీయ గీతాన్ని కూడా గౌరవించని పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు ప్రొటెం స్పీకర్ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రొటెంస్పీకర్ ఎంపికలోనూ సీఎం రాజకీయం చేస్తున్నారని చెప్పారు.

Next Story