వర్షాల ఎఫెక్ట్ .. ప్రయాణికులకు ఇబ్బందులు ..

వర్షాల ఎఫెక్ట్ .. ప్రయాణికులకు ఇబ్బందులు ..
x
Highlights

నాలాల కబ్జాలు, ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలతో వరద నీరు వెళ్లే అవకాశం లేక హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీనికి తోడు మెట్రో నిర్మాణాలు ఈ...

నాలాల కబ్జాలు, ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలతో వరద నీరు వెళ్లే అవకాశం లేక హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీనికి తోడు మెట్రో నిర్మాణాలు ఈ కష్టాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. మెట్రో పిల్లర్లు, డివైడర్ల వద్ద నీరు వెళ్లే దారి లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సుఖమయమైన ప్రయాణం అందించటానికి అందుబాటులోకి వచ్చిన మెట్రో సిటీ జనాలకు వర్షం కష్టాలను రెట్టింపు చేస్తుంది. మెట్రో లేక ముందు కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా మెట్రో రాకతో కొత్త ప్రాంతాల్లో సమస్యలు ఏర్పడ్డాయి.

జీహెచ్‌ఎంసీ, మెట్రోరైలు, ట్రాఫిక్‌ పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపంతో వర్షం పడితే చాలు వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. మెట్రో నిర్మాణాలు పలుచోట్ల వర్షపు నీటికి అడ్డుపడుతున్నాయి. కొన్నిచోట్ల రహదారిపై అడ్డంగా స్తంభాలు, డివైడర్లు ఉండటంతో వర్షం నీరు వెళ్ళేదారి లేక రోడ్డుపై నిలిచిపోతోంది .మెట్రోస్టేషన్లను ఎక్కువ చోట్ల లోతట్టు ప్రాంతాల్లోనే నిర్మించారు. గతంలో కూడా ఈ ప్రాంతాల్లో నీరు నిలిచేది. అయితే ఇప్పుడు మరింత ఎక్కువగా నిలువటమే కాకుండా తొలిగించటం ఇబ్బందిగా మారింది

రెండు వైపుల రహదారి పైనుంచి వచ్చే వరదనీరు స్టేషన్ల వద్ద నిలిచిపోతుంది. దీంతో గంటల తరబడి స్టేషన్ల ప్రాంగణాల్లో వరదనీటితో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రో మార్గాల్లో ప్రధాన రహదారిపై డివైడర్లను ఏర్పాటు చేశారు. వరదనీరు వెళ్లేందుకు అక్కడక్కడ వీటి కింద పైపులు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇవి మూసుకుపోయాయి. ఇక మెట్రో నిర్మాణంలో ముందుచూపు లేక పలుచోట్ల రహదారి మధ్యలో స్తంభాలు వేయడంతో ఆ దారులు ఇరుకిరుకుగా మారాయి. కొన్నిచోట్ల ఇవే వరదకు అడ్డుపడుతున్నాయి. కనీసం ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు

.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories