రైల్వేశాఖ సరికొత్త నిర్ణయం...ఎయిర్‌పోర్టు మాదిరిగా సెక్యూరిటీ చెకప్‌

railway stations
x
railway stations
Highlights

ఇక నుంచి సినిమాల్లో చూపించినట్లుగా కదులుతున్న ట్రైన్‌ను అందుకోలేకపోవచ్చు. చివరి నిముషంలో వచ్చి ట్రైన్‌ను వెంబడించి మరీ ఎక్కలేకపోవచ్చు. ఎందుకంటే విమానాశ్రయాల్లో మాదిరిగా రైల్వేస్టేషన్లలోనూ భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ స్పష్టం చేసింది.

ఇక నుంచి సినిమాల్లో చూపించినట్లుగా కదులుతున్న ట్రైన్‌ను అందుకోలేకపోవచ్చు. చివరి నిముషంలో వచ్చి ట్రైన్‌ను వెంబడించి మరీ ఎక్కలేకపోవచ్చు. ఎందుకంటే విమానాశ్రయాల్లో మాదిరిగా రైల్వేస్టేషన్లలోనూ భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ స్పష్టం చేసింది. ఇక నుంచి ప్రయాణీకులు స్టేషన్లకు 15 నుంచి 20 నిముషాల ముందే చేరుకోవాలనే కొత్త నిబంధనలు రాబోతున్నాయి.

ఎయిర్‌పోర్టుల్లో అనుసరించే సెక్యూరిటీ పద్దతులను ఇకపై రైల్వేస్టేషన్లలో కూడా అమలు కాబోతున్నాయి. దీనికోసం రైల్వే శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకుంది. విమానాశ్రయాల్లో విమానం బయలుదేరే సమయానికి కొన్ని గంటల ముందే సెక్యూరిటీ చెకింగ్‌ ఉంటుంది. అందుకు ప్రయాణీకులంతా ముందుగానే ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇలా రైల్వేస్టేషన్లలో కూడా అదే విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందు స్టేషన్‌కు చేరుకొని సెక్యూరిటీ చెక్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

త్వరలో ప్రారంభం కానున్న కుంభమేళా సందర్భంగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తొలుత ప్రయాగ్‌రాజ్‌ రైల్వే స్టేషన్‌లో అమలు చేయనున్నారు. దీంతో పాటు కర్ణాటకలోని హూబ్లీ సహా మరో 202 స్టేషన్లను కూడా ఎంపిక చేశారు. సెక్యూరిటీ చెక్‌ కోసం ఆయా స్టేషన్ల స్వరూపాన్ని కూడా మార్చుతారు. స్టేషన్ల ప్రాంగణాలను మూసివేసి చుట్టూ శాశ్వతంగా ప్రహరీ గోడలను నిర్మిస్తారు. కొన్నిచోట్ల తాత్కాలికంగా గేట్లు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఇందుకు వీలు లేని స్టేషన్లలో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కాపలా ఉంటారు. స్టేషన్‌కు ఉన్న ప్రతి ప్రవేశ ద్వారం సెక్యురిటీ చెక్‌ పాయింట్‌ ఉంటుంది. రైలు బయలుదేరే సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందు ప్రయాణికుడు చెక్‌ పాయింట్‌ దగ్గరకు తనిఖీ ప్రక్రియ ముగించుకోవాల్సి ఉంటుంది.

స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా తాము ప్రవేశపెట్టిన ఐఎస్‌ఎస్ కిందికి ఈ మార్పులు వస్తాయని రైల్వేశాఖ చెబుతోంది. ఇందులో భాగంగా స్టేషన్‌ ద్వారం దగ్గర సీసీ కెమెరాలు, బ్యాగులను స్కానింగ్‌ చేసే వ్యవస్థ, బాంబులను గుర్తించే పరికరాలు, వాటిని నిర్వీర్యం చేసే పరిజ్ఞానం వంటివి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 385 కు పైగా కోట్లు ఖర్చు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories