పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురి మృతి

పట్టాలు తప్పిన రైలు.. ఆరుగురి మృతి
x
Highlights

ఉత్తరాదిలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జోగ్బనీ- ఢిల్లీ మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్నా సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ...

ఉత్తరాదిలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జోగ్బనీ- ఢిల్లీ మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్నా సమీపంలో ఇవాళ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ఘటనలో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో ఆరుగురు మృతిచెందారు. అనేక మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైలు జోగ్బనీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ 8, ఎస్‌ 9, ఎస్‌ 10, బీ 3 ఏసీ కోచ్, ఒక జనరల్‌ బోగీ సహా మొత్తం తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. మూడు బోగీలు ఒకదానిపై ఒకటి పడిపోవడంతో పూర్తిగా ధ్వంసమైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.

మరోవైపు, బాధితుల సహాయం కోసం ఆయా ప్రాంతాల్లో రైల్వేశాఖ హెల్ప్‌ లైన్లు ఏర్పాటు చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'జోగ్బనీ-ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు షదాయ్ బజూర్గ్ వద్ద ప్రమాదానికి గురికావడంతో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయని, సహాయ, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి' అని ట్వీట్ చేశారు. బాధితుల సహాయార్థం రైల్వే శాఖ హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు.. సోన్సూర్ - 06158 221645, హజీపూర్ - 06224 272230, బరౌని- 06279 232222.

Show Full Article
Print Article
Next Story
More Stories