Top
logo

టీఆర్ఎస్ కు ఓటేస్తే మోదీకి వేసినట్లే: రాహుల్‌

టీఆర్ఎస్ కు ఓటేస్తే మోదీకి వేసినట్లే: రాహుల్‌
Highlights

నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ...టీఆర్ఎస్ కు...

నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ...టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుటంబ పాలన నడుస్తుందన్నారు రాహుల్. కేసీఆర్ కొత్త కొత్త భవనాలు నిర్మించుకుంటున్నారని అయితే పేదలకు ఇళ్లు నిర్మించడం లేదన్నారు. మోడీ పాలనలో నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. మోడీ లాగ కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదని రాహుల్ గాంధీ చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top