Top
logo

అధికారంలోకి వస్తే రఫేల్‌పై విచారణ : రాహుల్‌

అధికారంలోకి వస్తే రఫేల్‌పై విచారణ : రాహుల్‌
Highlights

2019సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తుందని

2019సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రఫేల్ ఒప్పందంపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఛీప్ రాహుల్ స్పష్టం చేశారు. అసలు రాఫేల్ చర్చఅంటేనే భారత ప్రధాని నరేంద్రమోడీ పారిపోతున్నారని రాహుల్ దుయ్యబట్టారు. రాఫెల్ వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు స్పందించిన రాహుల్ అసలు రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టు అనిల్ అంబానీకి ఏ విధంగా వెళ్లిందని ప్రశ్నించారు. విమానాల ధరలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్న ఆయన రాఫెల్ ఒప్పందంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకుని తన స్నేహితుడైన అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా చేశారని ఆరోపించారు. తాను మిమ్మల్ని గానీ, పారికర్‌ను గానీ నిందితులుగా చూపించడం లేదన్న రాహుల్ ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి మోడీ అని చెప్పారు.


లైవ్ టీవి


Share it
Top