రాహుల్ రెండో సీట్...భాగో రాహుల్.. భాగో అంటున్న స్మృతీ

రాహుల్ రెండో సీట్...భాగో రాహుల్.. భాగో అంటున్న స్మృతీ
x
Highlights

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేధీపై ఆశలు వదులుకుంటున్నారా? ఎందుకైనా మంచిదని దక్షిణాది నుంచి కూడా బరిలోకి దిగుతున్నారా? రాహుల్ కోటరీ మాత్రం ఆయన...

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేధీపై ఆశలు వదులుకుంటున్నారా? ఎందుకైనా మంచిదని దక్షిణాది నుంచి కూడా బరిలోకి దిగుతున్నారా? రాహుల్ కోటరీ మాత్రం ఆయన దక్షిణాదినా ఓ కర్చీఫ్ వేసి ఉంచడమే బెటరని భావిస్తోంది.. రెండు సీట్ల నుంచి నేతలు పోటీ చేయడం కామనే .. కానీ రాహుల్ కంచుకోట కాదనుకుని మరో సేఫ్ సీట్ వెతుక్కోడానికి కారణాలేంటి? పోటీ చేయబోయే ఆ రెండో సీట్ ఏది?

2019 సార్వత్రిక ఎన్నికలు దేశ వ్యాప్తంగా హై ఓల్టేజ్ ను పెంచుతున్నాయి. హేమా హేమీల జీవితాలే ఎన్నికల ముంగిట్లో ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దక్షిణాదివైపు చూస్తున్నారా అంటే అవుననే అనాలి గాంధీల కంచుకోట అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ రెండో ఛాయిస్ గా కర్ణాటక, లేదా కేరళ నుంచి బరిలోకి దిగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాహుల్ ఈ డెసిషన్ కి రాడానికి చాలా కారణాలే ఉన్నాయి. అమేథి లో ఎన్నిక అంటే గాంధీల కుటుంబానికి ఒకప్పుడు కేక్ వాక్ కానీ ఇప్పుడు సీన్ అలా లేదు 2009లో రాహుల్ అక్కడ నుంచి మూడు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.

2014 వచ్చే సరికి సీన్ పూర్తిగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రాహుల్ కు ప్రత్యర్ధిగా బలమైన నేతను దించింది. ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఇక్కడ రాహుల్ కి గట్టి పోటీ ఇచ్చారు. దాదాపు మూడు లక్షల ఓట్లను స్మృతి సాధించడంతో రాహుల్ కేవలం లక్ష ఓట్ల మెజారిటీతో మాత్రమే గట్టెక్కారు. మూడు దశాబ్దాలుగా అమేథీ ప్రజలు గాంధీ కుటుంబాన్ని గెలిపిస్తున్నప్పటికీ ఈ లోక సభ నియోజక వర్గ పరిధిలో అయిదు అసెంబ్లీ సిగ్మెంట్లలో నాలుగు బీజేపీ గెలుచుకుంది. గాంధీ కంచుకోటలోకి స్మృతీ ఇరానీ చొరబడి పెద్ద ఎత్తున ఓట్లు చీల్చడంతో కాంగ్రెస్ నేతలు ఖంగు తిన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అమేథీ నుంచి మాత్రమే బరిలో నిలిస్తే కొంప కొల్లేరవడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే రాహుల్ కోసం మరో సేఫ్ సీట్ పై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాయి. అమేథీ నుంచి రాహుల్ ఓడిపోతే ఆయనకు వ్యక్తిగతంగానే కాదు పార్టీకి కూడా తీరని నష‌్టం. కాంగ్రెస్లో జరుగుతున్న ఈ చర్చను చూసి స్మృతీ ఇరానీ జోరు పెంచారు భాగ్ రాహుల్ భాగ్ అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. అందుకే రిస్క్ తీసుకోకుండా దక్షిణాదిన మరో సీట్ కోసం చూస్తోంది కాంగ్రెస్. కానీ ఏక్కడా సీటు?

కర్ణాటక కాంగ్రెస్ ఇప్పటికే రాహుల్ ని ఆహ్వానించింది. ఇప్పటికే జేడీఎస్, కాంగ్రెస్ అధికారం పంచుకుంటున్నందున అక్కడ రాహుల్ భారీ మెజారిటీతో గెలిచే అవకాశముంది. రాహుల్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే పొరుగు రాష్ట్రాల కాంగ్రెస్ అభ్యర్ధులకు కొండంత బలం వచ్చినట్లుంటుంది. ప్రధాని అభ్యర్ధి కాబట్టి రాహుల్ పోటీ కాంగ్రెస్ కేండిడేంట్లకి ప్లస్ అవుతుంది. రాహుల్ దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తే యావత్ భారతాన్ని రిప్రజెంట్ చేసినట్లుంటుంది. ఎందుకంటే 2014లో మోడీ పోటీ చేసిన రెండు సీట్లు ఉత్తరాదివే.

రాహుల్ కుటుంబానికి కర్ణాటక కొత్తేం కాదు గతంలో నానమ్మ ఇందిర 1978లో చిక్మగళూర్ నుంచి గెలిచారు. అలాగే1980లో కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది. ఇక సోనియా గాంధీ 1999లో బళ్లారి నుంచి పోటీ చేశారు. బీజేపీ నేత సుష్మా స్వరాజ్ పై ఆమె మంచి మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ నేతలకు కర్ణాటక కంచుకోట లాంటిదని రాహుల్ మైసూరు నుంచి బరిలోకి దిగాలని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కోరారు. రాహుల్ కి తమిళనాడు నుంచి కూడా ఆహ్వానాలున్నాయి.

రాహుల్ పై ఈ ఊహాగానాలు సాగడంతో బీజేపీ విమర్శల జోరు పెంచింది. మరోవైపు మోడీని కూడా బెంగళూరు సౌత్ నుంచి పోటీకి దించుతారంటూ ప్రచారాలు సాగాయి. అయితే బీజేపీ అధిష్టానం వాటిని ఖండించింది. కానీ దివంగత నేత అనంత కుమార్ నియోజక వర్గం అభ్యర్ధిని పెట్టకపోవడంతో మోడీ అభ్యర్ధిత్వంపైనా అనుమానాలున్నాయి. మొత్తం మీద రాహుల్ రెండో సీట్ పై క్లారిటీ వచ్చే వరకూ ఊహాగానాలు ఇలాగే సాగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories