logo

మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌

మోడీ చేతిలో కేసీఆర్‌ రిమోట్‌
Highlights

అధికారంలోకి వస్తే జాతి, కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా పేదలందరికీ కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని...

అధికారంలోకి వస్తే జాతి, కుల, ప్రాంతీయ భేదాలు లేకుండా పేదలందరికీ కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ప్రధాని మోడీ దేశాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్నారన్న రాహుల్‌ కేంద్రంలో జరుగుతున్న అవినీతిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే తప్పనిసరిగా దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయం అందే విధంగా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఈ విషయంలో జాతి, కుల, ప్రాంతీయ భేదాలుండవని అందరికీ డబ్బు వచ్చేలా చూస్తామన్నారు. అది కాంగ్రెస్ లక్ష్యమని పేదల కోసం పనిచేస్తుందని వారికి న్యాయం జరిగే వరకు ఊరుకోమన్నారు.

ప్రధాని మోడీ దేశాన్ని రెండు ముక్కలు చేసేలా చూస్తున్నారని ఒకటి ధనవంతుల భారత్‌ అని అది అంబానీ భారత్ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. వీరు బ్యాంకుల్లో అప్పులు చేసి తర్వాత చెల్లించరని అయినా అలాంటి వారికి లక్షల కోట్లు అప్పులను మాఫీ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో మోడీ సర్కారు ఎలాంటి దుర్మార్గానికి పాల్పడినా టీఆర్ఎస్‌ ఎంపీలు వంత పాడుతారని కేసీఆర్‌ మద్దతు తెలుపుతారని రాహుల్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ ఎప్పుడైనా రాఫెల్‌ డీల్‌పై దర్యాప్తు జరగాలని కోరారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ అవినీతి మోడీకి తెలుసని ప్రధాని చేతిలో సీఎం రిమోట్‌ ఉందని అన్నారు. నీరవ్ మోడీ లాంటి వారిని పట్టుకొస్తామన్న రాహుల్‌ వారి నుంచి డబ్బును తీసుకుని పేదలకు పంచుతామన్నారు. అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తానని స్పష్టం చేశారు.


లైవ్ టీవి


Share it
Top