logo

ఏపీ ఈ దేశంలో భాగం కాదా?: రాహుల్‌

ఏపీ ఈ దేశంలో భాగం కాదా?: రాహుల్‌
Highlights

ఏపీ ప్రజల డబ్బును దోచుకుని ప్రధాని మోడీ అంబానికి కట్టబెట్టారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం...

ఏపీ ప్రజల డబ్బును దోచుకుని ప్రధాని మోడీ అంబానికి కట్టబెట్టారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్‌ భాగం కాదా? ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాటను మోడీ నిలబెట్టుకోరా? ఇటువంటి ప్రధాని దేశానికి అవసరమా? అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఏపీ భవన్‌లో చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన రాహుల్‌ మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అబద్దాలే చెబుతారని ఎక్కడి పాట అక్కడ పాడుతారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేరా అని ప్రశ్నించిన ఆయన అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అన్ని చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోడీ ప్రధానిగా ఉండేది ఇంకా 2 నెలలే అని అన్నారు.


లైవ్ టీవి

Share it
Top