వాయనాడ్‌లో రాహుల్ నామినేషన్.. ఓటర్లు ఆదరిస్తారా..?

వాయనాడ్‌లో రాహుల్ నామినేషన్.. ఓటర్లు ఆదరిస్తారా..?
x
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలుచేశారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీతో పాటు వాయనాడ్ నుంచి...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలుచేశారు. ఉత్తరప్రదేశ్ లోని అమేథీతో పాటు వాయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ సమయంలో రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు. కేరళలోని వాయ్ నాడ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. హెలికాప్టర్ ద్వారా కేరళ చేరుకున్న రాహుల్ గాంధీకి కేరళ రాష్ర్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతో పాటు కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు.

రాహుల్ నామినేషన్ వేసే ముందు సోదరి ప్రియాంక గాంధీతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమేథి నుంచి పోటీ చేస్తున్న రాహుల్ దక్షిణాది రాష్ర్టాలను ప్రధాని మోడీ పట్టించుకోక పోవడంతోనే ఇక్కడి ప్రజల మనోభావాలను ప్రతిబింబించేందుకు వయనాడ్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తన ప్రచారంలో కేరళలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లానన్నారు రాహుల్. కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపైనే తన పోరాటమన్నారు. సరిగ్గా 15 ఏళ్ల కిందట 2004 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి తొలిసారి నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. అప్పట్లో ఆయన చేతులు వణికాయి. ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రియాంకా రాహుల్ చేయి పట్టుకొని ఆందోళనను దూరం చేసింది. తాజాగా వయనాడ్ నుంచి రాహుల్‌ నామినేషన్ వేసే సమయంలోనూ పక్కన ప్రియాంక ఉంది.

రాహుల్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో రాహుల్ వెనకున్న ప్రియాంకా ఫొటో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. నా అన్న, నా నిజమైన స్నేహితుడు. ఇప్పటివరకు నాకు తెలిసిన అత్యంత ధైర్యవంతుడు. వయనాడ్.. ఆయనను బాగా చూసుకోండి మీ ఆశలను వమ్ము చేయడు అని ప్రియాంకా ట్వీట్ చేశారు. మరో వైపు అమేథీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నే స్మృతి ఇరాని తీవ్ర విమర్శలు చేశారు. అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు స్మృతి ఇరానీ. వాయ్ నాడ్ నుంచి పోటీ చేయడం అమేథీ ప్రజలకు ద్రోహం చేయడమే అన్నారు. వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ ను ఓటర్లు ఆదరిస్తారా లేదా అన్నది మరికొన్ని రాజుల్లో తేలనున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories