వాయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్

వాయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్
x
Highlights

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు ఈసారి...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు ఈసారి కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి ఆయన సోదరి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలసి ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories