కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తాం: రాహుల్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తాం: రాహుల్
x
Highlights

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దేశంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. దేశంలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దేశంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. దేశంలో 22 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ నేతల్లాగ తాను తప్పుడు హామీలు ఇవ్వనని రాహుల్ అన్నారు. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ బీజేపీ ప్రభుత్వ తప్పుడు హామీలను ఎండగట్టారు.

కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వ‌ద్రా ఇవాళ మ‌హాకాలేశ్వ‌రుడికి పూజ‌లు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ్యోతిర్లింగం క్షేత్రం ఉజ్జ‌యినికి వెళ్లిన ఆమె అక్క‌డ మ‌హాకాలేశ్వ‌రుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ రాష్ట్ర సీఎం క‌మ‌ల్‌నాథ్ కూడా ఆమె వెంట వెళ్లారు. గ‌ర్భగుడిలో ప్రియాంకా శివార్చ‌న‌లు చేశారు. ఆలయ సిబ్బంది వీరికి ఘన స్వాగతం పలికారు. గ‌త ఏడాది కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఉజ్జ‌యిని మ‌హాకాలేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories