Top
logo

సభలో రఫెల్ వార్

సభలో రఫెల్ వార్
X
Highlights

లోక్‌సభలో రఫెల్‌ వివాదం మరోసారి రచ్చ రచ్చ అయ్యింది. రఫెల్‌పై సమాధానం చెప్పేందుకు ప్రధాని మోడీకి ధైర్యం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో అన్నారు. రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ఉన్నా ఆమె అన్నాడీఎంకే ఎంపీల వెనుక దాక్కున్నారని ఎద్దేవా చేశారు.

లోక్‌సభలో రఫెల్‌ వివాదం మరోసారి రచ్చ రచ్చ అయ్యింది. రఫెల్‌పై సమాధానం చెప్పేందుకు ప్రధాని మోడీకి ధైర్యం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లోక్‌సభలో అన్నారు. రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ సభలో ఉన్నా ఆమె అన్నాడీఎంకే ఎంపీల వెనుక దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఒప్పందంలో చాలా లొసుగులు ఉన్నాయని గతంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ప్రధాని ఐదు నిమిషాలే స్పందించారని రాహుల్‌ అన్నారు.

రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ బెడ్‌ రూంలో ఉన్నాయన్న గోవా మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులను సభలోవినిపించాలని రాహుల్‌ పట్టుబట్టారు. అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ ఆడియో టేపులు నిజమని నిరూపించగలరా..? అని సవాలు విసిరారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. దీంతో సభ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వాయిదా పడింది.సభ పున: ప్రారంభం అయ్యాక రఫెల్‌ అంశంపై జేపీసీ వేయాలని పట్టుబట్టారు. సుప్రీం కోర్టు కూడా ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని మాత్రమే చెప్పిందని జేపీసీ ఏర్పాటు చేయొద్దని ఎక్కడాచెప్పలేదని రాహుల్‌ చెప్పుకొచ్చారు. ఒక్కో విమానానికి 16 వందల కోట్లు వెచ్చించేందుకు రక్షణశాఖ అధికారులు సైతం అభ్యంతరం తెలిపారని రాహుల్‌ చెప్పుకొచ్చారు. తన ప్రియ స్నేహితుడు అనిల్‌అంబానీకి లబ్ది చేకూర్చేందుకే మోడి ఒప్పందంలో మార్పులు చేశారని రాహుల్‌ ఆరోపించడంతో సభ మరోసారి వాయిదా పడింది.

Next Story