ఆ పగతోనే అమ్మాయిలను ట్రాప్‌ చేసి..

ఆ పగతోనే అమ్మాయిలను ట్రాప్‌ చేసి..
x
Highlights

హాజీపూర్‌ హత్యల వెనుక ఏళ్ల నాటి పగ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు మైనర్ల హత్య కేసులో ఉన్న మిస్టరీని ఛేదించారు. అత్యాచారం చేసి అతి కిరాతకంగా...

హాజీపూర్‌ హత్యల వెనుక ఏళ్ల నాటి పగ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు మైనర్ల హత్య కేసులో ఉన్న మిస్టరీని ఛేదించారు. అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపిన శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్‌ చేశామని విచారణ కొనసాగుతుందని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. తీవ్ర సంచలనం సృష్టంచిన హాజీపూర్‌ హత్యల మిస్టరీని ఛేదించినట్లు రాచకొండ పోలీస్‌కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. తమ విచారణలో ముగ్గురు మైనర్లను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు. గ్రామశివారులోని పాడుబడ్డ బావిలో మైనర్ల డెడ్‌బాడీలను పూడ్చిపెట్టిన ఆనవాళ్లను గుర్తించామని బావిలో జరిపిన తవ్వకాల్లో అస్థికలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ నెల 25 న అదృశ్యమైన శ్రావణిని వెతికే క్రమంలో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని.. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని సీపీ తెలిపారు. స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి బావి దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆ తర్వాత చంపి బావిలో పాతిపెట్టాడని వివరించారు. అలాగే 2015 లో కూడా కల్పన అనే అమ్మాయికి మాయమాటలు చెప్పి బావి దగ్గరికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేశాడని తెలిపారు. అదే ఏడాది ఓ అమ్మాయిపై అత్యాచారయత్నం చేశాడనే కేసు నమోదైందని తర్వాత 2016 లో శ్రీనివాస్‌రెడ్డిపై కర్నూల్ లో ఓ మహిళను చంపినట్లు కేసు నమోదైనట్లు వివరించారు.

2019 మార్చి 9 న డిగ్రీ చదువుతున్న మనీషా అనే అమ్మాయిని కూడా బావి దగ్గర అత్యాచారం చేసి హత్య చేశాడని శ్రావణి, మనీషా మృతదేహాలు బావిలో దొరికాయని మహేశ్‌ భగవత్‌ వివరించారు. ఇక రెండో బావిలో తవ్వకాలు జరిపి కల్పన అస్తికలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో శ్రీనివాస్‌రెడ్డిని కొట్టి అవమానించినందుకు గ్రామస్తులపై పగ పెంచుకున్నాడని అందుకే అమ్మాయిలను ట్రాప్‌ చేసి అత్యాచారం చేసి చంపుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సీపీ తెలిపారు. మెకానిక్ అయిన శ్రీనివాస్ రెడ్డి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని ఆల్కహాల్, గంజాయి తీసుకుంటాడని చెప్పారు. ఈ కేసులో డాగ్ స్కాడ్స్ బాగా ఉపయోగపడ్డాయని మహేశ్‌ భగవత్‌ వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories