పూరికి షాక్ : ఇన్ స్టాగ్రామ్ లో 'ఇస్మార్ట్ శంకర్' స్క్రిప్ట్ లీక్..!

పూరికి షాక్ : ఇన్ స్టాగ్రామ్ లో ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ లీక్..!
x
Highlights

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్.. రామ్ కి జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్.. రామ్ కి జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు . సినిమాని వచ్చే నెలలో విడుదల చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు దర్శకనిర్మాతలు .. అయితే సినిమాకి అసలు చిక్కు వచ్చి పడింది . సినిమా స్క్రిప్ట్ ని మురళీకృష్ణ అనే వ్యక్తి బజ్ బాస్కెట్ అనే ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. ఈ స్క్రిప్ట్ ను ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించాలంటే భారీగా నగదు ఇవ్వాలని మురళీకృష్ణ దర్శకుడు పూరిని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ నిర్మాణ సంస్థ అయిన పూరీ కనెక్ట్స్ ప్రతినిధి రవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. రవి ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories