Top
logo

ఈ బాలుడు మృత్యుంజయుడు

ఈ బాలుడు మృత్యుంజయుడు
X
Highlights

నిరీక్షణ ఫలించింది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 16 గంటల పాటు పడిన శ్రమ సలీకృతమైంది. మహారాష్ర్టలో బోరుబావిలో...

నిరీక్షణ ఫలించింది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 16 గంటల పాటు పడిన శ్రమ సలీకృతమైంది. మహారాష్ర్టలో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలుడిని చాకచక్యంగా కాపాడారు. ప్రమాదవశాత్తు రెండు వందల అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

పుణే 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న థ్రాడేండేల్ గ్రామంలో బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. బాలుడిని కాపాడేందుకు పోలీసులు., జాతీయ విపత్తు సహాయ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పది అడుగుల లోతులోనే బాలుడు పడిపోవడంతో బోరు బావికి సమాంతరంగా గుంత తవ్వారు. బాలుడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు బాబు ఆరోగ్యంగా ఉన్నాడని వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడు తల్లిదండ్రులతో మాట్లాడినట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు చెప్పారు.

Next Story