Top
logo

కశ్మీర్‌లోనే పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి... అదిల్‌కు శిక్షణిచ్చింది ఇతడే

కశ్మీర్‌లోనే పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి... అదిల్‌కు శిక్షణిచ్చింది ఇతడే
X
Highlights

పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘజీ ఇంకా...

పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారిగా అనుమానిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘజీ ఇంకా కశ్మీర్ లోయలోనే ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. పుల్వామాలో గురువారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్న ఘజీ అలియాస్ రషీద్ అఫ్గానీయే పుల్వామా ఆత్మాహుతి దాడికి సూత్రధారి అని అనుమానిస్తున్నారు.

అఫ్ఘనిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఘజీ ఐఈడీ నిపుణుడు కూడా. పుల్వామా దాడిలో ఆత్మాహుతి సభ్యుడు అదిల్ దార్‌కు శిక్షణ ఇచ్చింది కూడా అతడే. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌కు ఘజీ చాలా నమ్మకస్తుడు. కుడి భుజం లాంటి వాడు. యుద్ధ నైపుణ్యాలు, ఐఈడీ బాంబుల తయారీలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటాడు.

ఇటీవల మసూద్ అజర్ మేనల్లుడు ఉస్మాన్‌ను భద్రతా దళాలు మట్టబెట్టడంతో ప్రతీకారం కోసం ఘజీతోపాటు మరో ఇద్దరిని అజర్ కశ్మీర్ పంపించాడు. డిసెంబరు తొలి వారంలోనే కశ్మీర్ చేరుకున్న వీరు అప్పటి నుంచే దాడికి ప్రణాళిక రచించారు. పార్లమెంటుపై దాడి సూత్రధారి అఫ్జల్ గురు వర్ధంతి అయిన ఫిబ్రవరి 9నే దాడికి ప్లాన్ చేసినా, చివరికి 14న అమలు చేశారు.

Next Story