ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో..? ప్రొ. కే.నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో..? ప్రొ. కే.నాగేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు
x
Highlights

ఏపీలో ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు ప్రచారలతో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారంలో...

ఏపీలో ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు ప్రచారలతో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా అప్పుడే ఏపీలో ఎవరు చక్రం తిప్పబోతున్నారని కూడా తాజాగా ఓ సర్వేలో తెలిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని టైమ్స్‌ నౌ-వీఎమ్‌ఆర్‌ ఒపినియన్‌ సర్వే స్పష్టం చేసిన విషయం తెలిసిందు కాగా 25 లోక్‌సభ స్థానాలకు వైసీపీ పార్టీ 22 గెలుచుకుంటుందని అలాగే టీడీపీ పార్టీ కేవలం 3 సీట్లతోనే సరిపెట్టుకుంటుదని టైమ్స్‌ నౌ-వీఎమ్‌ఆర్‌ ఒపినియన్‌ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీలో జరగనున్న జమిలి ఎన్నికల్లో ఎవరిది విజయం? టైమ్స్‌ నౌ-వీఎమ్‌ఆర్‌ ఒపినియన్‌ సర్వే నిజమౌతుందా అనే అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫసర్ కే.నాగేశ్వర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా అయితే అంచనా వేయడం కష్టమని కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఏడు సీట్లు గెలుస్తుందని టైమ్స్‌ నౌ చెప్పిన విషయం తెలిసిందే కాగా ఆ ఎన్నికల్లో కేవలం బీజేపీ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుందని గుర్తుచేశారు. ఇక ఏపీలో ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య హోరా హోరి పోటీ మాత్రం పక్క ఉంటుందని చెప్పారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇటివల ప్రవేశపెట్టిన పథకాలతో టీడీపీ, అలాగే జనసేన-బీఎస్పీ కూటమి కారణంగా దళిత ఓటర్లు, కాపు ఓటర్లపై ప్రభావం, తదితర అంశాలు ఈ ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సి ఉందన్నారు. కాగా వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత జగన్ పెరుగుతున్నాడన్నది తన అంచనాగా చెప్పారు. కాగా ఎన్నికల రణరంగంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వీప్ చేసే సత్తా ఉందా..? లేదా అన్నది కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉందన్నారు. రాజకీయ విశ్లేషకుడు ప్రొఫసర్ కే.నాగేశ్వర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories