సిక్కోలును టెన్షన్ పెడుతున్న గజరాజులు

సిక్కోలును టెన్షన్ పెడుతున్న గజరాజులు
x
Highlights

రాత్రి పగలు తేడా లేదు... ఏ క్షణంలో తమ ప్రాణాలు గాల్లో కలిసి పోతాయో అన్న టెన్షన్ తో అంతా ఒణికిపోతున్నారు.. గజరాజుల బీభత్సం అంతా ఇంతా కాదు.. ఎప్పుడు ఎటు...

రాత్రి పగలు తేడా లేదు... ఏ క్షణంలో తమ ప్రాణాలు గాల్లో కలిసి పోతాయో అన్న టెన్షన్ తో అంతా ఒణికిపోతున్నారు.. గజరాజుల బీభత్సం అంతా ఇంతా కాదు.. ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి మీదపడుతాయో తెలియదు.. ఓ వైపు పంటలను సర్వనాశనం చేస్తున్న ఏనుగుల గుంపు... ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఏనుగుల బీభత్సంతో దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు శ్రీకాకుళం జిల్లా వాసులు.ఏళ్ల తరబడి తీష్ట వేసుకు కూర్చున్న ఏనుగులు ఆపరేషన్ గజను లెక్క చేయడం లేదు. గుంపులు..గుంపులుగా గ్రామాలపై పడుతున్నాయి.. ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయం నీడలో బతుకు వెళ్లదీస్తున్నారు.

ఫలితం ఇవ్వని అధికారుల ప్రయత్నాలు..

రాత్రికి రాత్రి గ్రామాల్లోకి వస్తున్న గజరాజులు పంటలను సర్వనాశనం చేస్తూ అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో ఏనుగుల గుంపు తారసపడుతున్నాయి. పాతపట్నం, కొత్తూరు, హీర మండలం, మెలియ పుట్టి మండలాల్లో ఏనుగుల సంచారం అధికంగా ఉంది. చెరుకు, వరి, మొక్క జొన్న పంటలను గజరాజులు ధ్వంసం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలపై ఏనుగులు కలియతిరుగుతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు జనావాసాల వైపు రాకుండా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఇవ్వడం లేదు. గ్రామ సరిహద్దుల్లో అగ్గి మంటలు వేసుకుని గ్రామస్తులు కాపలా కాస్తున్నారు. ఏ క్షణంలో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో అన్న టెన్షన్ స్థానికులను వెంటాడుతోంది. ఏనుగుల బీభత్సంతో ప్రాణనష్టాన్ని నివారించగలిగామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఏనుగుల మంద సంచారంపై ఎప్పటికప్పుడు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తున్నారు. ఆపరేషన్ గజ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అటవీ శాఖ ఏనుగుల అలజడిని మాత్రం ఆపలేకపోతుంది. ఏనుగుల స్వైరవిహారంతో జరుగుతున్న నష్టాన్ని అటవీ శాఖ అడ్డుకోలేకపోతుంది.. ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టి గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా చూడాలని సిక్కోలు ప్రజలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories