లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ లేనట్టేనా..?

లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ లేనట్టేనా..?
x
Highlights

కాంగ్రెస్‌ రాజకీయాల్లో మరో సంచలనం. కాంగ్రెస్ పార్టీకి, అన్నకు అండగా ఉన్న ప్రియాంకాగాంధీ ప్రత్యక్షంగా ప్రచార రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. రాబోయే...

కాంగ్రెస్‌ రాజకీయాల్లో మరో సంచలనం. కాంగ్రెస్ పార్టీకి, అన్నకు అండగా ఉన్న ప్రియాంకాగాంధీ ప్రత్యక్షంగా ప్రచార రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చేందుకే ప్రియాంకను రంగంలోకి పార్టీ దింపింది. ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించడంతో, యూపీ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నీండింది. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ పోటీలోకి దిగబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రాష్ట్రంలో యోగి పాలనపై ప్రియాంక విమర్శలు చేస్తే, జనం మనసులలో బలమైన ముద్ర వేయొచ్చన్నది కాంగ్రెస్ భావన. కానీ పార్టీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రియాంక లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు, ర్యాలీలకే ప్రియాంక పరిమితం కానున్నారట. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు ఉత్తరప్రదేశ్‌ విభాగానికి ఇన్‌ఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించారు. భవిష్యత్తు రాజకీయాలను ఆమె శాసించబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ బాధ్యతలు చేపట్టిన తరువాత లక్నోలో పాల్గొన్న మొదటి ర్యాలీ లో ప్రియాంక గాంధీ ఒక్క మాట కూడా మాట్లడాలేదు ఇది అందరిని ఆశ్చరపరించింది. ఎన్నికల్లో ప్రియాంక ర్యాలీలు, ఉపన్యాసాలు ఉండకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. కేవలం తెర వెనుక వ్యూహాలకు మాత్రమే ప్రియాంక గాంధీ పరిమితమయ్యే అవకాశం ఉందంటున్నారు. కాగా సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఎన్నికల్లో పాల్గోనే అవకాశాలు లేవనే అనుకుంటున్నారు. రాయ్ బరేలీ నుంచి ప్రియాంకను పోటీకి దింపుతారని నిన్నటి వరకు ప్రచారం సాగింది. 15మంది లోక్‌సభ అభ్యర్థులతో కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని ప్రకటించడంతో ప్రియాంక గాంధీ పోటీచేయడం లేదని తెలిపోయింది. కానీ ఎక్కడి నుండైనా ప్రియాంక గాంధీ ఎన్నికల రణరంగంలో దిగుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మాత్రం ప్రియాంక గాంధీ పోటీలో ఉంటారో లేదో అని చర్చ జోరుగా సాగుతుంది. వీటన్నికి మరి ఈ వారంలోనే అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories