మోదీ ఇలాకాలో ప్రియాంకా గాంధీ రోడ్ షో..

మోదీ ఇలాకాలో ప్రియాంకా గాంధీ రోడ్ షో..
x
Highlights

వారణాసి మరోసారి మెరిసిపోయింది. పార్టీ ఆదేశిస్తే మోడీపై పోటీకి రెడీ అంటూ ఊరించి ఊరించి నిరాశపరిచిన ప్రియాంక అదే వారణాసిలో రోడ్ షో చేసి అభిమానులను సంతోష...

వారణాసి మరోసారి మెరిసిపోయింది. పార్టీ ఆదేశిస్తే మోడీపై పోటీకి రెడీ అంటూ ఊరించి ఊరించి నిరాశపరిచిన ప్రియాంక అదే వారణాసిలో రోడ్ షో చేసి అభిమానులను సంతోష పరిచారు. కిక్కిరిసిన రోడ్ల మధ్య నుంచి ప్రియాంక వాహనం వెడుతుంటే మేడలు, మిద్దెలపై నుంచి జనం ఆసక్తిగా చూశారు. వారణాసి నగరం మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది.. పార్టీ ఆదేశిస్తే మోడీని ఢీకొంటానంటూ పదే పదే ప్రకటించి శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిన ప్రియాంకా గాంధీ మోడీ నియోజక వర్గంలో హల్ చల్ చేశారు. మోడీ రోడ్ షోకు ఏ మాత్రం తీసిపోని విధంగా భారీ రోడ్ షో నిర్వహించారు.

వారణాసి నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్ కు మద్దతుగా ప్రియాంక ఈ షో నిర్వహించారు. ఎర్రని చీరలో పసిడి వర్ణంలో మెరిసిపోయిన ప్రియాంకను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.గతనెల 25న మోడీ ఇదే వారణాసిలో అతిపెద్ద రోడ్ షో నిర్వహించారు. దానికి దీటుగా ప్రియాంక షో కూడా అదిరిపోయే రేంజ్ లో నిర్వహించారు.

వారణాసిలోని పండిట్ మదన్ మోహన్ మాలవీయ విగ్రహం నుంచి కాశీ విశ్వనాధ ఆలయం ఆపై దశాశ్వ మేథ ఘాట్ వరకూ ఈ ర్యాలీ సాగింది. మోడీ నిర్వహించిన రూట్ లోనే ప్రియాంక రోడ్ షోను ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణులు ఒక విధంగా సవాల్ విసిరాయి. రోడ్ షో అనంతరం కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆమె సందర్శించారు. అక్కడ పూజలు జరిపాక కాలభైరవ ఆలయాన్ని కూడా సందర్శించారు.

వారణాసి కోసం కాంగ్రెస్ ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించింది. వచన పత్ర పేరుతో విడుదలైన ఆ మేనిఫెస్టోలో ఆలయాలను పునరుద్ధరిస్తామని, కాశీ విశ్వనాధ కారిడార్ నిర్మిస్తామనీ వాగ్దానం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, రైతులు, మహిళలకు సాధికారత కల్పిస్తామనీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెబుతోంది.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు అస్సీ ఘాట్ దగ్గర ప్రత్యేకంగా మూడు రోజుల పాటూ యాగం నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories