logo

ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు...కుంభమేళాలో పుణ్యస్నానం తర్వాత...

ప్రియాంక గాంధీ రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు...కుంభమేళాలో పుణ్యస్నానం తర్వాత...
Highlights

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది....

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగం కాంగ్రెస్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఫిబ్రవరి 4న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో గంగానదిలో పుణ్యస్నానమాచరించిన తర్వాత ప్రియాంకగాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారు.

కుంభమేళాలో ప్రియాంకతో పాటు రాహుల్ గాంధీ పుణ్యస్నానం చేయనున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 4న కాకుంటే 10న వసంత పంచమి రోజు కావడంతో ఆ రోజు ప్రియాంక బాధ్యతలు చేపడతారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో పాగా వేసేందుకు ప్రియాంక గాంధీ పాటు జ్యోతిరాదిత్య సింధియాకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు రాహుల్ గాంధీ.

లైవ్ టీవి

Share it
Top