అమేథీలో గెలుపుకు ప్రియాంక పవర్ ప్లే

అమేథీలో గెలుపుకు ప్రియాంక పవర్ ప్లే
x
Highlights

వారణాసిలో పోటీలో లేకపోవడం తనను నిరాశపరచలేదంటున్నారు ప్రియాంక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమంటున్న ప్రియాంక బీజేపీ...

వారణాసిలో పోటీలో లేకపోవడం తనను నిరాశపరచలేదంటున్నారు ప్రియాంక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమంటున్న ప్రియాంక బీజేపీ మెజారిటీ తగ్గించేందుకు పకడ్బందీగా వ్యూహం పన్నుతున్నారు. అమేథీలో గ్రామ గ్రామాన పర్యటిస్తూ మోడీని, స్మృతీ ఇరానీని విమర్శిస్తూ సాగుతున్నారు.

అభ్యర్ధుల ఎంపికతోనే తాము సగం గెలిచేసామంటున్నారు కాంగ్రెస్ తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా అన్ని నియోజక వర్గాల్లోనూ పటిష్టమైన అభ్యర్ధులను నిలబెట్టామని, బీజేపీ ఆధిక్యతను తగ్గించేందుకు కచ్చితంగా ప్లాన్ రచించామనీ ఆమె అంటున్నారు. పార్టీ ప్రచార బాధ్యతలు, అభ్యర్ధుల గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నందునే వారణాసిలో పోటీకి నిలబడలేదంటున్నారు ప్రియాంక.

యూపీలో బీజేపీ ఓటమి ఖాయమని ప్రియాంక తేల్చి చెప్పారు. తమ పార్టీ మహాఘట్ బంధన్ ఓట్లను కాదని, బీజేపీ ఓట్లను కొల్లగొట్టేందుకే రంగంలోకి దిగిందన్నారు. అయిదవ దశ ఎన్నికనెదుర్కొంటున్న అమేథీలో తన అన్న గెలుపు కోసం కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రచార వేగం పెంచారు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సాగుతున్న ప్రియాంక ప్రచారంలో మోడీని టార్గెట్ చేసి ప్రశ్నలు సంధిస్తున్నారు అభివృద్ధి పేరుతో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ఈ అయిదేళ్లలో చేసినదేమీ లేదని అమేథీ ప్రజలు ఈ విషయం ఆలోచించాలనీ అన్నారు.

పంటల విధ్వంసం నుంచి రైతులకు ఉపశమనం కలిగించలేక పోయారని, రైతులు రాత్రివేళ పొలాల్లో కాపలా ఉండాలసిన దుస్థితి వస్తోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు ధర పైనా ఆలోచన చేయడంలేదన్నారు. రైతుల పంటల గురించి చింత లేదు కానీ పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారన్నారు.

మన ప్రజల బాగోగులు పట్టించుకోరు గానీ ప్రపంచ దేశాలు తిరుగుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. సమయా భావం వల్ల ప్రియాంక ప్రచారం వేగం పెంచారు. వారణాసిలో పోటీ చేయక పోవడం తనను నిరాశ కలిగించలేదన్నారు ముందు తన అన్నను, కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించుకోవల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. స్మృతీ ఇరానీ తన అన్నకు అసలు పోటీనే కాదంటున్న ప్రియాంక మోడీ మాటలకు, చేతలకు చాలా తేడా ఉందంటున్నారు. ఈనెల 6న అమేథీలో అయిదవ దశ పోలింగ్ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories