ఉస్మానియా యూనివర్సిటీలో మరో గందరగోళం..

ఉస్మానియా యూనివర్సిటీలో మరో గందరగోళం..
x
Highlights

వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేట్ పరం దిశగా అడుగులు వేస్తుందా..? విద్యార్ధుల వసతి గృహాల నిర్వాణ బాధ్యత ప్రైవేట్ సంస్థలకు ఔట్...

వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేట్ పరం దిశగా అడుగులు వేస్తుందా..? విద్యార్ధుల వసతి గృహాల నిర్వాణ బాధ్యత ప్రైవేట్ సంస్థలకు ఔట్ సోర్సింగ్ కు అప్పగించనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది..ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇందుకు అద్దం పడుతున్నాయి. విద్యార్ధి సంఘాలు పెదవి విప్పకపోయినప్పటికీ ఓయూ విద్యార్ధుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాష్ర్ట ఏర్పడిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు తీరుతాయని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు..కానీ తాజాగా ఓయూ పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు ఏకంగా ప్రైవేటైజేషన్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. హస్టల్ ఫీజులు.. మెస్ బకాయిలు వసూలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకవర్గం చెబుతోంది.

యూనివర్సిటీ విద్యార్ధుల హాజరు కోసం బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన పాలకవర్గం.. హాస్టల్‌ ఫీజు, మెస్‌ బకాయిలు వసూలు చేయనున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులను ఖాళీ చేయించడం, నాన్‌ బోర్డర్లను బయటకు పంపి హాస్టళ్ల నిర్వహణ క్రమేణా అవుట్‌ సోర్సింగ్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.

ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడానికే హస్టళ్ల నిర్వాహణ బాధ్యత ప్రైవేట్ వారికి అప్పగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విద్యార్ధులు మండి పడుతున్నారు. విద్యార్ధులపై అధికర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్ధులు చదువుకునే యూనివర్సిటినీ బ్రస్టు పట్టించడమే అంటున్నారు. ఇదే జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ స్టూడెంట్స్. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో మరో గందరగోళం నెలకొందని చెప్పుకోవచ్చు. విద్యార్ధులు మెస్ ప్రైవేటికరణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories