దత్తాత్రేయకు మోదీ క్షమాపణలు

దత్తాత్రేయకు మోదీ క్షమాపణలు
x
Highlights

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో జరిగిన 'విజయ్ సంకల్ప్'సభలో ఆయన...

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో జరిగిన 'విజయ్ సంకల్ప్'సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో ప్రధాని మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతిసారీ హోలీ తర్వాత 'రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈసారి తెల్లగా ఉందేం?'అని ప్రశ్నించారు. దత్తాత్రేయ స్పందిస్తూ 'కొద్దికాలం క్రితం మా అబ్బాయి చనిపోవడంతో ఈసారి హోలీలో పాల్గొనలేదని, అందుకే జుట్టు తెల్లగా ఉందని'చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ 'నాకు ఆ విషయ జ్ఞాపకం లేదు క్షమించండి'అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories