ఏపీకి ప్ర‌ధాని మోడీ.. వ‌రాలు ప్ర‌క‌టిస్తారా?

ఏపీకి ప్ర‌ధాని మోడీ.. వ‌రాలు ప్ర‌క‌టిస్తారా?
x
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన ఖరారైంది. దేశ ప్రధాని హోదాలో మోదీ రెండవ సారి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోబోతున్నారు. 2014 పార్లమెంట్...

ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన ఖరారైంది. దేశ ప్రధాని హోదాలో మోదీ రెండవ సారి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోబోతున్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాని హోదాలో ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ భారీ మోజార్టీతో గెలిచింది. మరో సారి ప్రధాని మోడీ శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ నెల 9న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రధాని మోడీ వస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో తిరుమలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల ప్రచారంలో తిరుపతికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వామివారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో అలిపిరి వద్ద అమిత్ షా కాన్యాయ్ పై టీటీడీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ప్రదాని పర్యటన నేపథ్యంలో తిరుమలలో పోలీసులు నిఘా పెంచారు. మోడీ పర్యటన సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే, మోడీతో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారిక భేటీల‌కి స‌మ‌యం కోరుతున్నారు. కేంద్రానిని నివేదించాల్సిన అంశాల పైన ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. మోడీకి స్వాగ‌తం ప‌ల‌క‌టానికి ప్ర‌ధానితో పాటుగా తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, సీఎం జ‌గ‌న్ పాల్గొంటున్నారు. అయితే, ఏపీలో ఉన్న ప్ర‌త్య‌క ప‌రిస్థితులపైన ప్ర‌మాణ స్వీకారానికి ముందుగానే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానికి వివ‌రించారు. పూర్తి వివ‌రాల‌తో వ‌స్తే మ‌రోసారి చ‌ర్చిద్దామంటూ సూచించారు. గత 2014 ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో తిరుప‌తి వేదిక‌గానే ఏపీకీ ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాని అభ్య‌ర్దిగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు హయంలో ఏపీకి హోదా ఇవ్వ‌లేమ‌ని ప్యాకేజీ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే అదీ సైతం ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు కాలేదు. ఇక‌, ఇప్పుడు కేంద్రంలో మ‌రో సారి అధికారంలోకి రావ‌టం ఏపీలోనూ ప్ర‌భుత్వం మారటంతో మోదీ ఆలోచ‌న‌ల్లో సైతం మార్పు వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. చూడాలి మరీ మోడీ పర్యటనతో ఏపీకి తీపి కబురు ఇస్తారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories